ETV Bharat / state

Viral Video: వ్యాక్సిన్​ వేసుకోనని మొండికేసిన వ్యక్తి.. అందరూ కలిసి ఏం చేశారంటే..? - టీకా వేసుకోనని గ్రామస్థుడు మారాం.. అందరూ కలిసి ఏం చేశారంటే..?

వ్యాక్సిన్​ తీసుకుంటే కరోనాను నియంత్రించగలమని ఆరోగ్య కార్యకర్తలు వివరించారు. టీకా తీసుకోవాలని అభ్యర్థించారు. అయినా ఆ వ్యక్తి టీకా తీసుకోనంటూ మొండికేశాడు. తోటి గ్రామస్థులు కూడా.. సముదాయించారు. టీకా తీసుకోవాలని నచ్చజెప్పారు. కొందరైతే బతిమాలారు కూడా. అయినా.. ఆ వ్యక్తి తీసుకోనంటే తీసుకోనని చిన్నపిల్లాడిలా మారాం చేశాడు. ఇక మాటలతో పని కాదని గ్రహించిన వాళ్లంతా.. ఏం చేశారంటే..?

health-workers-doing-vaccination-in-intresting-way-at-pochampally-village

author img

By

Published : Oct 26, 2021, 4:08 PM IST

నవ్వులు పూయిస్తోన్న వీడియో

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు వెనకాడుతున్నారు. ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న అవగాహనను కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్లను బలవంతంగా తీసుకెళ్లి మరీ.. టీకాలు ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

వ్యాక్సిన్​ తీసుకోని వారిపై ఫోకస్​..

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని పోచంపల్లిలో ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఏఎన్​ఎమ్​, ఆశా వర్కర్లు గ్రామాల్లో ఎంత అవగాహన ఇచ్చినప్పటికీ... కొంతమందికి కరోనా వ్యాక్సినేషన్ పట్ల ఉన్న అపోహలతో టీకా వేసుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. అయినా పట్టువదలని ఏఎన్​ఎమ్​, ఆశ వర్కర్లు.. గ్రామంలో ఇప్పటికీ వ్యాక్సిన్​ వేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గ్రామస్థులపై ఆరోగ్య కార్యకర్తలు దృష్టి పెట్టారు. ఇంటింటికీ తిరుగుతూ... ఎవరెవరు ఇప్పటివరకు వ్యాక్సిన్​ వేసుకోలేదని ఆరా తీసి.. పేర్లు నమోదు చేసుకుని వారిపై ఫోకస్​ పెట్టారు.

తీసుకోనంటే తీసుకోనని..

వ్యాక్సిన్​ వేసుకోని వారు ఇళ్లల్లో, వీధుల్లో.. ఎక్కడ ఉన్నా వదిలిపెట్టట్లేదు. దగ్గరుండి మరీ తీసుకెళ్లి టీకా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలో ఓ వ్యక్తి ఇప్పటికీ టీకా తీసుకోలేదు. అతడికి ఎదురుపడి.. వ్యాక్సిన్​ వేసుకోవాలని ఆరోగ్య కార్యకర్తలు వివరించారు. అంతా విన్న ఆ వ్యక్తి.. తీసుకోనని పట్టుబట్టాడు. ఆరోగ్య కార్యకర్తలతో పాటు పలువురు స్థానికులు కూడా అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. మొండి పట్టు పట్టాడు. వ్యాక్సిన్​ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు వివరించినా.. అర్థం చేసుకోకుండా తీసుకోనంటే తీసుకోనని మొండికేశాడు.

చిన్న పిల్లాడిలా తీసుకెళ్లారు...

ఇక చేసేదేమీ లేక.. స్థానికుల సాయంతో ఆ వ్యక్తిని బలవంతంగానైనా వ్యాక్సిన్ వేయించాలని కార్యకర్తలు నిశ్చయించుకున్నారు. టీకా తీసుకోనని సతాయిస్తున్న గ్రామస్థుడు పారిపోకుండా.. అందరూ కలిసి గట్టిగా పట్టుకున్నారు. చిన్నపిల్లాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు.. ఓ బైక్​ మీద ఎక్కించారు. బండి మీద నుంచి ఎక్కడ దూకి పారిపోతాడోనని.. వెనక నుంచి మరో వ్యక్తి కూర్చొని గట్టిగా పట్టుకున్నాడు. నేరుగా టీకా కేంద్రానికి తీసుకెళ్లారు. బలవంతంగా.. కరోనా వ్యాక్సిన్​ ఇప్పించారు. చిన్న పిల్లాడిలా ఆ వ్యక్తి చేసిన హంగామాను చూసి.. చుట్టుపక్కల వాళ్లంతా నవ్వుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారటంతో.. చూసిన వారి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి.

ఇలాగే మొండికేసిన పలువురు గ్రామస్థులను బలవంతంగా ద్విచక్రవాహనాలపై కేంద్రానికి తీసుకెళ్లి కరోనా వ్యాక్సిన్ ఇప్పించారు. అనంతరం వారికి ఉన్న అపోహలు తొలగించేందుకు అవగాహన కల్పించారు. అందరూ కరోనా వ్యాక్సిన్​ తీసుకోవాలని.. టీకా వల్లే కరోనాను నియంత్రించగలమని గ్రామస్థులకు వివరిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.