మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోని అభ్యాస్ పాఠశాలలో వినూత్నంగా సంబురాలు నిర్వహించారు. విద్యార్థుల నానమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలను పాఠశాలకు ఆహ్వానించి వేడుకలు జరిపారు. మనువళ్లు మనువరాళ్లకు ఆటలు నేర్పించిన వాళ్లనే కాసేపు చిన్నపిల్లలను చేసి సరదాగా ఆటలాడించారు. చిన్నారులతో పాటు నానమ్మ-తాతయ్యలతోనూ స్టేప్పులేయించారు.
ఉత్సహంగా పాల్గొన్న జంటలకు పాఠశాల యాజమాన్యం బహుమతులను అందించింది. మనువళ్లు, మనువరాళ్లతో ఉపాధ్యాయులు పాద పూజ చేయించారు. అనంతరం వచ్చిన వృద్ధ జంటలందరినీ యాజమాన్యం శాలువాలు కప్పి సత్కరించింది.
కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. తాతయ్యలు, నానమ్మలు ఆటలాడుతుంటే... మనువరాళ్లు, మనువళ్లు ఉత్సాహపరుస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమాలతో పాఠశాల పరిసరాలు కోలాహలంగా మారాయి.