Four members died car hit the bus at Tirupati : ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రహదారిపై శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యవాత పడ్డారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి చెందిన నెమ్మది వెంకటమ్మ కుటుంబ సభ్యులు వెంకన్న దర్శనం చేసుకున్న తిరిగి వస్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీ కొట్టగా ప్రమాదంలో అక్కడిక్కడే ముగ్గురు మరణించారు.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఒకరు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఒక చిన్నారి, కుటుంబ పెద్ద వెంకటమ్మ, ఆమె ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో చిన్నారికి బ్రెయిన్‌డెడ్ కావడంతో ఆసుపత్రిలో చావుబతుకులతో పోరాడుతున్నట్లు సమాచారం.
ఇది జరిగింది: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన నెమ్మది వెంకటమ్మ, లింగయ్య దంపతులకు ముగ్గురు కుమారులు వెంకన్న, రాంబాబు, అశోక్, కుమార్తె రేణుక ఉన్నారు. 18 ఏళ్ల కిందట కుటుంబ పెద్ద లింగయ్య మృతి చెందారు. ఆ తరువాత ఆ కుటుంబానికి అన్ని తానే వెంకటమ్మ కూలి పనులు చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసి మంచి చదువులు చదివించింది. ఇద్దరు కుమారులు, కుమార్తెకు పెళ్లి కూడా చేసింది.
- Live video on Car Accident At LB Nagar : డ్రైవర్ నిర్లక్ష్యం.. కారు డోర్ తగిలి రెండేళ్ల చిన్నారి మృతి
- Road accidents in Warangal Today : నెత్తిరోడిన రహదారులు.. అసువులుబాసిన రక్తసంబంధీకులు
వెంకన్న, రాంబాబు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు సాధించారు. వెంకన్న జనగామలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో, రాంబాబు జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు అశోక్ గతంలో ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో కూతురు రేణుక తన కుమారుడి పుట్టువెంట్రుకల మొక్కును తీర్చడానికి తిరుపతికి వెళ్తుండటంతో తల్లిని, అన్నదమ్ములను వేడుకకు రావాలని ఆహ్వానించింది.
వెంకటమ్మ తన ముగ్గురు కుమారులు, ఇద్దరు మనవరాళ్లతో కలిసి మే 30న రెండు కార్లతో తిరుపతి పయనమయ్యారు. తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న రాంబాబు నిద్రమత్తులో శ్రీకాళహస్తి మార్గంలోని ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద శ్రీకాళహస్తి నుంచి ప్రయాణికులతో తిరుపతి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు: ఈ ప్రమాదంలో కారు ముందు సీటులో కూర్చొన్న అశోక్ (35), వెంకన్న చిన్న కుమార్తె శాన్వితాక్షరి (6), వెనుక సీటులో కూర్చొన్న వెంకటమ్మ (65) అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వెంకన్న (40), రాంబాబు (38), భాన్వితాక్షరి (10) శ్రీకాళహస్తి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రికి హుటబహుటినా తీసుకెళ్లారు. వీరిలో వెంకన్న చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. భాన్వితాక్షరికి బ్రెయిన్‌డెడ్ కావడంతో ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం.
ఇందులో రేణుక కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక ఉండటంతో వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. మృతదేహాలకు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం స్వస్థలం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి తీసుకొచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. భర్త వెంకన్న, ఇద్దరు కుమార్తెలను పోగొట్టుకొని దుఃఖసాగరంలో మునిగిపోయి రోదిస్తున్న తల్లి జ్యోతిని ఓదార్చడం ఎవరి సాధ్యం కాలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకునేందుకు ఈ కుటుంబంలో ఆరుగురు వెళ్లగా ఒక్కరే ప్రాణాలతో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు.
ఇవీ చదవండి: