యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కి రాస్తా రోకో చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ అన్నదాతలు నినాదాలు చేశారు. గత 15 రోజులుగా సహకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఒక్కొక్క రైతుకు రెండు బస్తాల యూరియాను ఇస్తున్నారు. గోదాంలో యూరియా అయిపోతే క్యూలైన్లలో నిల్చున్న వారికి టోకెన్లను ఇస్తూ లారీలు వచ్చిన తర్వాత వారికి యూరియా పంపిణీ చేస్తున్నారు. టోకెన్లు తీసుకున్న రైతులకు గత 5 రోజులుగా యూరియా బస్తాలను ఇవ్వకపోవడం వల్ల రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులందరికీ సరిపోయే విధంగా యూరియాను సరఫరా చేయాలని కోరారు.
ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్లో నలుగురు దొంగల అరెస్ట్