పోడు రైతులకు అటవీ అధికారులకు మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. హరితహారం కింద మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు(forest officer) పోడు భూములను ఎంచుకుంటున్నారు. ఆ భూముల్లో ఏవైనా పంటలు వేస్తే.. వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సదరు భూముల్లో పంటలు వేసుకున్న రైతులు.. లబోదిబోమంటున్నారు. కష్టపడి పెట్టుబడి పెట్టి వేసిన పంటను అన్యాయంగా నాశనం చేస్తున్నారంటూ.. రైతులు అధికారుల మీదికి రైతులు గొడవకు దిగుతున్నారు. ఈ ఘర్షణల్లో అధికారుల(forest officer)కు రైతులకు మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం బొల్లెపెల్లిలో... పోడు రైతులు, ఆటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని పోడు భూములలో మొక్కలు నాటే కార్యక్రమం కోసం అటవీశాఖ అధికారులు పరిశీలనకు వెళ్లారు. సదరు భూముల్లో మిరప తోట వేసి ఉండటాన్ని అధికారులు గమనించారు.
కాళ్ల మీద పడి వేడుకున్నా..
ఆ భూముల్లో ఉన్న మిరప నారును పీకేయటం ప్రారంభించారు. అప్పటికే తోటలో ఉన్న కూలీలు అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులు, రైతులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. తోపులాటలో ఓ రైతు అంగీ చినిగిపోయింది. అనంతరం వచ్చిన ఉన్నతాధికారులు.. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయింది. మిరప తోటను ధ్వంసం చేయవద్దని రైతులు... అటవీశాఖ అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. అయినప్పటికీ... రైతులు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. ప్రాణం పోయినా కదిలేదని రైతులు అదే భూమిలో భీష్మించుకుని కూర్చున్నారు. ఇక చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు.
బట్టలు చినిగిపోయేలా కొట్టారు..
"తరతరాలుగా ఇదే భూమిలో తాము పంట పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. దౌర్జన్యంగా వచ్చి.. మిరపనారును ధ్వంసం చేశారు. పంట ధ్వంసం చేయకూడని అడ్డుకున్నందుకు మహిళా కూలీల మీద చేయిజేసుకున్నారన్నారు. ఒంటి మీద ఉన్న బట్టలు చినిగిపోయేలా కొట్టారు. ఇలా చేయటం ఇది రెండోసారి. ప్రాణం పోయినా.. ఈ భూమిని వదులుకునేంది లేదు. ఎండనకా.. వాననకగా కష్టపడి వేసిన పంటను.. అధికారులొచ్చి దౌర్జన్యంగా పీకేస్తున్నారు. మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి." - బాధిత రైతు
ఇదీ చూడండి