ETV Bharat / state

పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతుల ధర్నా - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు

తమ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ మహబూబాబాద్‌లో రైతులు ధర్నా నిర్వహించారు. నూతన చట్టం అమల్లోకి వచ్చినా కూడ పాసుపుస్తకాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు.

farmers strike to give passbooks for our lands in mahabioobabad district
పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతుల ధర్నా
author img

By

Published : Nov 11, 2020, 4:57 PM IST

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రైతన్నలు ధర్నాకు దిగారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చినా తమకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. అనంతరం జేసీని కలిసి వినతి పత్రం అందజేశారు. పాసుపుస్తకాలు లేక రైతుబంధు కోల్పోయామని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ సర్పంచే కారణం:రైతులు

గ్రామంలోని దాదాపు 650 మంది రైతులకు అన్నిరకాల హక్కు పత్రాలు ఉన్నా పాసుపుస్తకాలు రాలేదని వాపోయారు. ఆ భూమి అటవీ పరిధిలో ఉందని అధికారులు చెప్పడాన్ని వారు ప్రశ్నించారు. దీనికి ప్రధాన కారణం నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ యాకూబ్‌ రెడ్డే కారణమని ఆయనను నిలదీశారు. గతంలో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని మరోసారి తన ప్రయత్నం చేస్తానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.