మిర్చి ధరను వ్యాపారులు తగ్గించారని రైతులు రాస్తారోకో చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ మిర్చి ధర 15,000 పలకగా.. నేడు 12000 నుంచి 13,000కే అడుగుతున్నారని రైతులు మండిపడ్డారు.
మార్కెట్ ముందు తొర్రూరు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. వ్యాపారులు తమ ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నారని... రైతులకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: దేశంలోనే తెలంగాణ నెంబర్వన్