ETV Bharat / state

టేకు మొక్కల పెంపకానికి ప్రోత్సహకరం - మరిపెడ తాజా వార్తలు

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో టేకు మొక్కల పెంపకానికి ఉపాధిహామీ పథకం ఊతంగా నిలుస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులకు టేకు మొక్కలను అందజేస్తున్నారు. పొలం గట్లు, బీడు, బంజరు భూముల్లో వీటిని పెంచుకునే వీలుంది. ఆరో విడత హరితహారంలో భాగంగా జిల్లాలో 24.78 లక్షల మొక్కలను నాటించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

టేకు మొక్కల పెంపకానికి ప్రోత్సహకరం
టేకు మొక్కల పెంపకానికి ప్రోత్సహకరం
author img

By

Published : Jul 10, 2020, 1:16 PM IST

టేకు మొక్కల పెంపకానికి ఉపాధిహామీ పథకం ఊతంగా నిలుస్తోంది. నర్సరీల నుంచి మొక్కల తరలింపు, గుంతల తవ్వకం మొదలు రెండేళ్ల పాటు పెంపకానికి రైతులకు ఆర్థిక చేయూతనివ్వనుంది. ఉపాధిపథకంలో రైతులకు కల్పించే సదుపాయాలపై యంత్రాంగం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రైతులు టేకు మొక్కల పెంపకంపై దృష్టి సారిస్తే పర్యావరణ పరిరక్షణకూ దోహదపడుతుంది.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో రైతులకు టేకు మొక్కలను అందజేస్తున్నారు. పొలం గట్లు, బీడు, బంజరు భూముల్లో వీటిని పెంచుకునే వీలుంది. ఆరో విడత హరితహారంలో భాగంగా జిల్లాలో 24.78 లక్షల మొక్కలను నాటించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎకరం భూమి ఉన్న రైతుకు 150 మొక్కలు అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గంలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఉపాధిహామీ పథకం ద్వారా..

ఉపాధిహామీ కూలీలతోనే గుంతలు తవ్విస్తారు. మొక్కల సంరక్షణకు ఒక్కో మొక్కకు నెలకు రూ.5 చొప్పున రైతుకు అందించనున్నారు. ఇలా రెండేళ్లపాటు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. సంబంధిత మండల ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి నెలా రైతుల వివరాలను అంతర్జాలంలో నమోదు చేసిన తర్వాత నిధులు చెల్లిస్తారు.

జాబ్‌కార్డు అవసరం

ఉపాధిహామీ పథకం కింద టేకు మొక్కలను పొందాలనుకునే రైతులకు తప్పనిసరిగా జాబ్‌కార్డు ఉండాల్సిందే. దాంతో పాటు భూమికి సంబంధించిన పాస్‌పుస్తకం, బ్యాంకు ఖాతాలను ఈజీఎస్‌ సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ రైతుకు పర్యవేక్షణ నిధులు వస్తాయి. పెద్ద రైతులకు మాత్రం యాజమాన్య చెల్లింపులు రావు.

లక్ష్యాన్ని చేరేందుకు చర్యలు..

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా రైతులకు టేకు మొక్కలను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అర్హత ఉన్న రైతులకు మొక్కలను అందిస్తున్నాం. జిల్లాలో 24.78 లక్షల మొక్కలు నాటేందుకు సన్నద్ధమయ్యాం. ఇప్పటికే 15.15 లక్షల గుంతలను తవ్వించాం. 8.13 లక్షల మొక్కలు నాటించాం. పొలం గట్లపై వాటిని నాటిస్తున్నాం. ఈ రెండు నెలల్లో లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తాం. ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాం. ఆసక్తి, అర్హత ఉన్న రైతులు టేకు మొక్కల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

- విద్యా చందన, డీఆర్‌డీవో

మరిపెడ మండలంలో 3.5 లక్షల మొక్కలు

ఉపాధిహామీ పథకంలో జిల్లాలోని 16 మండలాల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మొక్కలు పెంచుతున్నారు. వాటిని ఈ ఏడాది రైతులకు పంపిణీ చేయనున్నారు. టేకు విత్తనాలను తమిళనాడులోని కడలూరు నుంచి తెప్పించారు. వాటిని ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెంచుతున్నారు. మరిపెడ మండలంలో ఈ ఏడాది 3.5 లక్షల మొక్కలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇవీ చూడండి: కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.