ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రభావం కొవిడ్ టీకా ప్రక్రియపై స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రోజుకు 10 నుంచి 20వేల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేస్తుండగా... 45 ఏళ్లకు పైబడిన వారికే రెండో డోసు ఇవ్వడంతో 10వేలకు పడిపోయింది. లాక్‌డౌన్ అమలుతో తొలిరోజు వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.
బుధవారం మహబూబ్‌నగర్‌లో కేవలం 328 మంది, నాగర్‌కర్నూల్ జిల్లాలో 150, నారాయణపేట జిల్లాలో 72 డోసులు, వనపర్తి జిల్లాలో 49 డోసులు, జోగులాంబ గద్వాల జిల్లాలో 110 డోసులు మాత్రమే అందించారు. అంతకుముందు రోజు ఇచ్చిన డోసులు గమనిస్తే మహబూబ్‌నగర్‌లో 15 వందల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. నాగర్‌కర్నూల్ 1328, జోగులాంబ గద్వాల 558, వనపర్తి జిల్లాలో 892 డోసులను అందించారు. లాక్‌డౌన్ వల్ల ఎక్కువ మంది టీకా కేంద్రాలకు రాలేకపోతున్నారు. 10 గంటల తర్వాత రవాణా సౌకర్యం అందుబాటులో ఉండకపోవడం అడ్డంకిగా మారుతోంది. రెండో డోస్ తీసుకునేందుకు తప్పకుండా రావాలని వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి : బ్లాక్ ఫంగస్: ఔషధం ఉత్పత్తికి సన్నాహాలు