ETV Bharat / state

ఈటీవీ భారత్ చొరవ.. వలస కూలీలకు మంత్రి బాసట

'ఈనాడు-ఈటీవీ భారత్​’ చొరవతో వలస కూలీలకు మంత్రి సత్యవతి రాఠోడ్‌ వసతులు కల్పించారు. మహారాష్ట్ర నుంచి 10 కుటుంబాలు మహబూబాబాద్‌ మండలం మల్యాలలోని మిర్చి తోటల్లో పనులకు వచ్చారు. లాక్​డౌన్​ నేపథ్యంలో స్వస్థలాలకు బయలుదేరిన వారిని ఈనాడు- ఈటీవీ భారత్​ కదిలించింది. ఆ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. చివరకు వారికి ఆసరా దొరికింది.

author img

By

Published : Apr 10, 2020, 9:42 AM IST

eenadu-etv bharath migrant laborer with India's initiative in mahabubabad
'ఈనాడు-ఈటీవీ భారత్​’ చొరవతో వలస కూలీలకు బాసట

పొరుగు రాష్ట్రం నుంచి కూలీ పనులకు వచ్చిన వారికి లాక్‌డౌన్‌తో ఉపాధి కరువైంది. విధి లేక కాలినడకన స్వస్థలాలకు బయలుదేరిన వారికి ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ చొరవతో ఆసరా దొరికింది. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా నుంచి 10 కుటుంబాలు మహబూబాబాద్‌ మండలం మల్యాలలోని మిర్చి తోటల్లో పనులకు వచ్చారు. సుమారు 400 కి.మీ. దూరంలోని సొంతూళ్లకు బయలుదేరారు. ఆదివారం అమనగల్‌ సమీపంలోని ఓ చెట్టుకింద ఉండగా వీరిని ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ ప్రతినిధి గమనించారు.

మంత్రి సత్యవతి రాఠోడ్‌కు విషయం చెప్పగా.. ఆమె మహబూబాబాద్‌ డీఎస్పీ నరేశ్‌కుమార్‌ను పంపించారు. తర్వాత మంత్రి వచ్చి, ఇక్కడే ఉండమని కూలీలకు నచ్చజెప్పారు. రూ.10 వేలు అందించి అమనగల్‌ ఉన్నత పాఠశాలలో వసతి ఏర్పాట్లు చేయించారు. నిత్యావసరాలు, 2 క్వింటాళ్ల బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ‘మహబూబాబాద్‌కు 5600 మంది కూలీలు వచ్చినట్లు గుర్తించాం. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వారికి సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ‘మీ నిరాడంబరతకు ప్రశంసలు’ అని మంత్రి కేటీఆర్‌ రాఠోడ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి : నేటి నుంచి పీజీ వైద్య విద్య ప్రవేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.