మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట శివారులోని రైస్ మిల్లులో ప్రతిష్టించిన గణనాథున్ని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: దోమల నివారణే.. జ్వరానికి మందు..!