మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని తెలిపారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను... దళారులు దోచేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు ఈ కేంద్రాలను వినియోగించుకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ సుశీల, జడ్పీటీసీ భూక్యా సంగీత, పీఏసీఎస్ ఛైర్మన్ సంపెట రాముతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం