ETV Bharat / state

మహబూబాబాద్​లో విధులు బహిష్కరించి డాక్టర్ల నిరసన.. కారణమేంటంటే..? - telangana latest news

ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్​లో డాక్టర్​ భూక్య వెంకటేశ్వర్లుపై జరిగిన దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట డాక్టర్లు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్లు ప్రాణాలను కాపాడేందుకే కృషి చేస్తారని, ప్రాణాలు తీయరని అన్నారు.

వైద్యుల నిరసన
వైద్యుల నిరసన
author img

By

Published : Jan 13, 2023, 9:39 PM IST

ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్​లో ముక్కుకు శస్త్ర చికిత్స చేస్తుండగా మరణించిన మహిళ తరఫు బంధువులు డాక్టర్​ భూక్య వెంకటేశ్వర్లుపై చేసిన దాడిని ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ముందు డాక్టర్లు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్లపై జరిగిన దాడిని ఖండించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. సేవ చేయాలనే డాక్టర్ వృత్తిలోకి వచ్చామని.. డాక్టర్లు ప్రాణాలను కాపాడేందుకే కృషి చేస్తారని, ప్రాణాలు తీయరని అన్నారు.

డాక్టర్​పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని వైద్యులు హెచ్చరించారు. మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్​లో పోలీస్ అవుట్ పోస్ట్​ను ఏర్పాటు చేసి డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డాక్టర్ల వృత్తిలోకి వచ్చేందుకు భయపడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

"డాక్టర్ భూక్య వెంకటేశ్వర్లుపై జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ కాలేజ్ అసోసియేషన్ తరపున పది నిమిషాల పాటు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశాం. సేవ చేయాలనే డాక్టర్ వృత్తిలోకి వచ్చాం. డాక్టర్లు ప్రాణాలను కాపాడేందుకే కృషి చేస్తారు కానీ ప్రాణాలు తీయరు. ఇలాంటి దాడులు పునరావృతమవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తాం. మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్​లో పోలీస్ అవుట్ పోస్ట్​ను ఏర్పాటు చేసి డాక్టర్లకు రక్షణ కల్పించాలి." - చింతా రమేశ్,​ డాక్టర్

డాక్టరు భూక్యా వెంకటేశ్వర్లపై దాడిని ఖండిస్తూ వైద్యుల నిరసన

అసలేం జరిగిందటే..: ఖమ్మంలోని పుట్టకోటకు చెందిన సత్తి వెంకటలక్ష్మి(26) ముక్కులో నొప్పి వస్తోందని ఈ నెల 6న ఖమ్మం జిల్లా ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగంలో వైద్యుడిని సంప్రదించారు. పరీక్షల అనంతరం డీఎన్‌ఎస్‌(డీవియేటెడ్‌ నాజల్‌ సెప్టమ్‌) సమస్య ఉందని తేల్చారు. ఆమెకు ఆసుపత్రిలో మంగళవారం శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఆయాసం వచ్చి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

డాక్టర్ల నిర్లక్షం వల్లే శస్త్ర చికిత్స జరుగుతుండగా వివాహిత మృతి చెందిందంటూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మాట్లాడేందుకు వచ్చిన సూపరింటెండెంట్​ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆయనపై దాడి చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.