మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ముందు ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లు కార్పొరేట్ ఆస్పత్రి వర్గాలకు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుకూలంగా, పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా బంద్ పాటిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బిల్లుపై పునరాలోచించాలని కోరారు.
ఇదీ చదవండిః భాజపా వైపే అందరి చూపు: లక్ష్మణ్