కరోనా కట్టడికి నిబంధనలను రైతులు, వ్యాపారులు, కార్మికులు విధిగా పాటించాలని ఏఎస్పీ ప్రభాకర్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు.
మాస్కులను విధిగా ధరించాలి
ప్రయాణికులు తమ భద్రత కొరకు మాస్కులను విధిగా ధరించాలని ఏఎస్పీ ప్రభాకర్ సూచించారు. బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటించి.. శానిటైజర్స్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రజల నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్ విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు