కిడ్నీ బాధితులు ఆరోగ్యవంతులుగా మారాలంటే రక్తశుద్ధి ఎంతో అవసరం. అందుకు గాను మహబూబాబాద్ , నర్సంపేట, జనగామ, ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. వీటిలో 29 పడకలున్నాయి. కానీ రోగుల సంఖ్య ఎక్కువ ఉండటంతో పడకలు సరిపోవడం లేదని బాధితులు వాపోతున్నారు.
మహబూబాబాద్ ఐదు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయగా నాలుగు పనిచేస్తున్నాయి. ఎంజీఎంలో 14 పడకలు ఉండగా 108 మందికి రక్త శుద్ధి ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీంతో చాలామంది ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతూ అప్పుల పాలవుతున్నారు.
'ఒక్కో రోగికి పదిహేను రోజులకోసారి, కొందరికి వారంలో రెండు సార్లు, మూడు సార్లు రక్తం శుద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. నాలుగు షిఫ్టుల్లో డయాలసిస్ చేస్తున్నా సమయం కుదరడం లేదు. డయాలసిస్ రోగులకు మెరుగైన చికిత్సను అందించేందుకు అవసరమైనన పడకలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం.'
----------- డాక్టర్ వెంకట్రాములు, మహబూబాద్ ప్రభుత్వ ఆసుపత్రి
ఇదీ చదవండి: 10లక్షలు ఇవ్వకపోతే ఫేస్బుక్లో న్యూడ్ వీడియోలు పోస్ట్ చేస్తా..!