మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యటించారు. మోద్గులగూడెంలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించి ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను ప్రశ్నించారు. వివిధ ప్రశ్నలు అడిగి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు.
విద్యార్థులు బాగా చదివి ప్రయోజకులు కావాలన్నారు. నేత్ర సమస్యతో బాధపడుతున్న విద్యార్థికి ఆపరేషన్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కందికొండలో ఉపాధి హామీ పనులు, కురవిలో పల్లెప్రగతి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : నా కొడుకు హత్యలో పెద్దోళ్ల హస్తముంది: కిషన్ రావు