మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్ బైక్‌ని దహనం చేశారు. బాధితుడు పాల్వాయి ధర్మేష్ ఫిర్యాదు మేరకు కేససముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
భూ వివాదమే కారణమా..
ఇటీవల బాధితుడి కుటుంబానికి నిందితులకు మధ్య భూవివాదం జరిగింది. ఆ కారణంగానే బైక్‌ని నిందితులు కాల్చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్: కేటీఆర్