ETV Bharat / state

'ప్రధానోపాధ్యాయుడి మరణం.. కచ్చితంగా ప్రభుత్వ హత్యే..' - ప్రధానోపాధ్యాయుడి మృతిపై బండి సంజయ్ రియాక్షన్

Bandi Sanjay on HM death: పనిచేస్తున్న జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కావడంతో మనోవేదనతో ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో గురువారం రాత్రి జరిగింది. జేత్​రాం మరణం పట్ల ఎంపీ బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

Bandi Sanjay
బండి సంజయ్
author img

By

Published : Dec 31, 2021, 12:10 PM IST

Bandi Sanjay on HM death: రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన బదిలీల నేపథ్యంలో... వేరే జిల్లాకు బదిలీ అయ్యాననే మనస్తాపంతో ఓ ప్రధానోపాధ్యాయుడు మరణించిన ఘటన మహబూబాబాద్​లో చోటు చేసుకుంది. సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాకు ట్రాన్స్​ఫర్ అవడంతో జేత్​రాం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు.

జేత్​రాం మరణం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలే జేత్​రాం మరణానికి కారణమని ఆరోపించారు. తక్షణమే ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Revanth Reddy House Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.