Baby Changeing in Mahabubabad Govt Hospital : మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల తారుమారు కలకలం సృష్టించింది. గత నెల 31న ఓ గర్భిణీ బాబుకు జన్మనివ్వగా.. బాలుడికి పసిరకలు కావడంతో ఇంక్యుబేటర్‌లో పెట్టారు. ఈ నెల 4న మరో గర్భిణీకి పుట్టిన పాపకు అనారోగ్యంగా ఉండడంతో ఆ చిన్నారిని మరో ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఎస్ఎన్సీయూ సిబ్బంది చేసిన పొరపాటుతో కాసేపు ఆస్పత్రిలో ఆందోళన(Concern at Hospital) నెలకొంది. చివరికి ఆస్పత్రి వైద్యసిబ్బంది కలుగజేసుకుని మరోసారి ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
Baby Change at Government Hospital : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన భూక్య సుమిత్ర జూలై 31వ తేదీన డెలివరీ కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో వైద్యులు శస్త్ర చికిత్స చేయడంతో ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చింది. కానీ పుట్టినబాబు పసిరికలు కావడంతో ఎస్ఎన్సీయూలోని ఇంక్యుబెేటర్ బాక్స్‌లో పెట్టారు. అలా వారం రోజులుగా ఆ బాబును బాక్స్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసముద్రం మండలం దస్రు తండాకు చెందిన సునీత అనే గర్భీణీకి ఈ నెల 4వ తేదీ ప్రసూతి కాగా ఆమె పాపకు జన్మనిచ్చింది. సునీతకు పుట్టిన చిన్నారికి(Infant Baby) శ్వాస సరిగా ఆడకపోవడంతో ఆ పాపను కూడా ఎస్ఎన్సీయూలోని బాక్స్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు.
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మ.. అంతా బాలికలే.. గర్భిణీకి సాధారణ డెలివరీ
కాటుక బొట్టు బాబును గుర్తించేలా చేసింది : ఈ క్రమంలో ఇంక్యుబేషన్(Incubation)లో ఉన్న బాబుకు పాలు ఇవ్వడం కోసం వైద్యసిబ్బంది ఎస్‌ఎన్‌సీయూలో ఉన్న సుమిత్ర బాబును సునీతకు ఇచ్చారు. అదే సమయంలో బాబుని తీసుకున్న సునీత కుటుంబ సభ్యులు వార్డుకు వచ్చారు. కొంత సమయం తర్వాత వార్డులో ఉన్న కొందరు సునిత మీకు పాప పుట్టింది కదా... బాబు ఎక్కడ నుంచి వచ్చాడు అని ప్రశ్నించారు. ఈ విధంగా ప్రశ్నిస్తున్న సమయంలో సునీత వద్ద ఉన్న బాబును సుమిత్ర అమ్మ(బాబు అమ్మమ్మ) చూసి బాబుకు ఉన్న కాటుక బొట్టును గమనించి ఆ బొట్టున తానే(అమ్మమ్మ) పెట్టిన.. ఆ అబ్బాయి మా బాబే మీ దగ్గరికి ఎలా వచ్చాడని వారితో వాగ్వాదానికి దిగింది. బాబును ఇచ్చిన వైద్య సిబ్బందితోను తమ బాబును వారికి ఎలా ఇస్తారని గొడవకి దిగింది. దీంతో తప్పును తెలుసుకున్న వైద్య సిబ్బంది బాబును సుమిత్రకు అప్పగించారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని హామీని ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ విషయం తెలుసుకున్న బ్లూ కోట్స్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు.
Teacher Beats Students Karimnagar : 'మీరు పుట్టి వేస్ట్ రా' అంటూ.. విద్యార్థులను చితకబాదిన టీచర్'
నాకు ఆడపిల్లలంటే ప్రాణం.. కానీ నా భార్యకు అబార్షన్ చేయండి.. కన్నీరు పెట్టించే ఓ తండ్రి కథ
'ఆ బిడ్డ నాకు పుట్టలేదు'.. 26రోజుల శిశువుపై తండ్రి కర్కశం.. బ్లేడుతో మెడ, చెయ్యి కోసి..