మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో వద్ద విధుల్లో చేరుతామంటూ కార్మికులు భారీగా చేరుకున్నారు. విధుల్లో చేరుతున్నట్లు డిపో మేనేజర్‌కి వినతి పత్రాలు అందజేస్తామన్న అనుమతి లేదంటూ పోలీసులు కార్మికులను అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు 52 రోజులుగా సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని... చివరకి సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వస్తే ఆరెస్ట్ చేయడం బాగాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!