ETV Bharat / state

కంచెలో చిక్కుకున్న వృద్ధుడు... మూడు రోజులుగా అక్కడే... - కంచెలో చిక్కుకున్న వృద్ధుడు

ఓ వృద్ధుడు తన ఇంటికి సమీపంలోని కంచెలో అనుకోకుండా చిక్కుకుపోయాడు. శక్తినంతా ఉపయోగించి బయటకు రావడానికి ప్రయత్నించినా అతని ఆశలు అడిశయాలే అయ్యాయి. ఎవరినైనా పిలిచేందుకు కూడా అతని దగ్గర సత్తువ లేదని గ్రహించి మోనరోదనలో మునిగిపోయాడు. అలా ఒకటి కాదు రెండు కాదు... మూడు రోజులు అక్కడే ఉండిపోయాడు.

an-old-man-trapped-in-a-fence
కంచెలో చిక్కుకున్న వృద్ధుడు
author img

By

Published : Sep 23, 2021, 10:49 AM IST

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం పిల్లిగుండ్లతండాకు చెందిన బాదావత్‌ శ్రీరామ్‌ (65) భార్య కొంతకాలం కిందట మృతి చెందింది. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. కుమారుడు ఉపాధి కోసం వేరే గ్రామంలో ఉంటున్నాడు. అప్పటినుంచి శ్రీరామ్‌ ఒంటరిగా జీవిస్తున్నారు. మూడు రోజుల కిందట కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఆయన... ఇంటి సమీపంలో ఉన్న ఇనుప కంచెలో చిక్కుకున్నారు.

దానిని విడిపించుకుని బయటకు వచ్చే శక్తిలేక... అక్కడే ఉండిపోయాడు. మూడు రోజులుగా అక్కడే పడి ఉన్న వృద్ధుడిని ఎవరూ గుర్తించలేకపోయారు. బుధవారం అంగన్‌వాడీ టీచర్‌ సుజాత గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తొర్రూరు ఎస్సై సతీష్‌, కానిస్టేబుల్‌ సాయికృష్ణ అక్కడికి వచ్చారు. వృద్ధుడిని కంచె నుంచి బయటకు తీసుకొచ్చి, జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమానికి తరలించారు.

మూడు రోజులుగా కంచెలో చిక్కుకున్న అతనిని వేరే ఎవరూ గమనించలేదు అంటే ఓ అర్థముంది. అతని ఇంటికి వచ్చేవారు తక్కువ కాబట్టి. కానీ పిల్లలు తండ్రి ఏమైపోయాడో అనే సోయి లేకుండా ఉండడమే దారుణంగా ఉంది. కనీసం ముగ్గురు పిల్లల్లో ఒక్కరైనా అతనికి ఫోన్ చేసి ఉండాల్సింది. తండ్రి నుంచి జవాబు లేకపోతే వేరే ఎవరికైనా ఫోన్ చేసి చూడమని చెప్పి ఉంటే... అతనికి మూడురోజులు కంచెలో చిక్కుకునే బాధ ఉండేది కాదు. ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ... ఏమైనా జరిగి ఉంటే కూడా ఎవరికి తెలిసేది కాదు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం తప్పు కాదు. కానీ పట్టించుకోకపోవడమే అసలైన తప్పు.

ఇదీ చూడండి: Road accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై ప్రమాదం.. 15 మందికి గాయాలు.. భారీగా ట్రాఫిక్​ జామ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.