గ్రామాల్లో అధికారులంతా బాహుబలిలాగా పని చేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే ఇష్టమని.. ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చని ఈ లోపే గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేసుకోవాలన్నారు. పల్లె ప్రగతిని విజయవంతం చేసుకున్న మనం.. పట్టణ ప్రగతినీ విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు గ్రామ పంచాయతీలకు 140 ట్రాక్టర్లను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, హరిప్రియ, సీతక్క, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గ్రామాల్లో, తండాల్లో మంత్రి సత్యవతి రాఠోడ్ పల్లెనిద్ర