రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డోర్నకల్ శాసనసభ్యుడు రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు రైతులకు ప్రభుత్వం రాయితీపై కేటాయించిన జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు.
రైతులకు వానాకాలం సీజన్లో అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసుకొని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎక్కువగా సన్నరకం వరిసాగుపై దృష్టి సారించాలని అన్నదాతలను కోరారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రూ.25 వేల రుణాలు మాఫీ చేసిందని.. కేసీఆర్ సమగ్ర సాగు విధానానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 41 కరోనా కేసులు