ETV Bharat / state

A young man died getting married tomorrow : రేపు పెళ్లి.. కరెంట్ షాక్​తో వరుడు మృతి - భూక్యా యాకుబ్​

young man died today while getting married tomorrow in mahabhubabad : తెల్లవారితే పచ్చని తోరణాల నడుమ బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో.. చావుడప్పులు మోగాల్సిన విషాదం చోటుచేసుకుంది. రేపు పెళ్లి అనగా విద్యుతా​ఘాతంతో వరుడు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో చోటుచేసుకుంది.

suicide
suicide
author img

By

Published : May 11, 2023, 7:43 PM IST

young man died today while getting married tomorrow in mahabhubabad : విధి ఎంత విచిత్రమైందంటే కొన్ని సార్లు మన కళ్లముందు జరిగిన సంఘటనలు.. వాస్తవమేనా అన్న అనుమానం వస్తుంది. తెల్లవారితే పెళ్లి.. బంధువులతో ఇల్లంతా కోలహాలంగా ఉంది. అందరూ పెళ్లి పనులలో నిమగ్నమైపోయారు. ఇంతలోనే మృత్యుదేవత కరెంట్​ రూపంలో వచ్చింది. పెళ్లికొడుకు బోర్​ మోటర్​ మరమ్మతు చేస్తున్న క్రమంలో విద్యుతా​ఘాతంతో మృతి చెందాడు.

మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్యా యాకుబ్(23) కు గార్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మే 12న వివాహం జరగవలసి ఉంది. మే 11వ తేదీన ఇంట్లో బోరు బావి చెడిపోవడంతో యాకుబ్ మోటర్​కు మరమ్మతు చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుతా​ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అంతా అవాక్కయ్యారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

married junior doctor committed suicide due to dowry harassment in hanmakonda : హనుమకొండ జిల్లాలో అదనపు వరకట్నం వేధింపులకు తాళలేక ఓ జూనియర్ డాక్టర్ బలవన్మరణానికి పాల్పడింది. యువ వైద్యురాలు కుందూరు నిహారిక(25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఎంజీఎం వరంగల్​లో ఫిజియోథెరపిస్టుగా విధులు నిర్వర్తిస్తోంది.

ఏడాదిన్నర క్రితం దుగ్గొండి మండలం కేశవపురంకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ రేవూరి గంగాధర్​రెడ్డితో వివాహం అయ్యింది. వీరు హనుమకొండలోని భవానీనగర్​లో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగు నెలల క్రితం పాప జన్మించింది. పాప పుట్టినప్పటి నుంచి అత్తింటి వారు అదనంగా వరకట్నం తేవాలని వేధింపులకు గురి చేశారని.. పలుమార్లు గొడవలు కూడా అయ్యాయని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు.

అత్తింటి వేధింపుల కారణంగానే తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడిందని.. నాలుగు నెలల చిన్నారి అనాథగా మార్చి వెళ్లిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. వృత్తిపరంగా ఒక వైద్యురాలిగా స్థిరపడిన తమ కుమార్తెను అదనపు కట్నం పేరుతో మానసికక్షోభకు గురిచేశారన్నారు. తన ఆత్మహత్యకు కారకులైన భర్త.. సహా వారి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని నిహారిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.