మహబూబాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో కలెక్టరేట్ కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. 30 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసి టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారధి ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని... లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: హుస్నాబాద్‌లో పట్టపగలే ఇల్లు గుల్ల