మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజరలో విషాదం జరిగింది. మిషన్ భగీరథ గేట్వాల్ గుంతలో పడి షేక్ ముస్తపా అనే యువకుడు మరణించాడు. వాటర్ ట్యాంక్ పక్కనే గేట్ వాల్ కోసం తీసిన గొయ్యి పైకప్పు వేయకపోవడం వల్ల ప్రమాదవశాత్తు ముస్తఫా అందులో పడిపోయాడు. తలభాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. గేట్ వాల్‌పై కప్పు వేయకపోవడం వల్లే ముస్తాపై చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని... మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: ఔషధ ఏజెన్సీ సీజ్... రోగ నిర్ధరణ పరికరాలు స్వాధీనం