కరోనా సెకండ్ వేవ్‌లో రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో 30 వరకు లాక్డౌన్ పెట్టిన నేపథ్యంలో దానిని పకడ్బందీగా అమలు చేయాలని డీజీపీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ పోలీసులు దృష్టి సారించారు.
ఉదయం 10 గంటల తర్వాత నిబంధనలు ఉల్లఘించి రోడ్డు మీదకు వచ్చిన 60వాహనాలను తోర్రుర్ డీఎస్పీ సీజ్ చేశారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో.. కరోనా కట్టడికి అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. 10 గంటల తర్వాత రోడ్లపైకి రావద్దని కోరారు.