ETV Bharat / state

స్పందించిన జడ్పీటీసీ.. మహిళ వద్దకే ఆధార్​ - వికలాంగ పింఛన్​

భర్తను కోల్పోయింది. ఉన్న కుమార్తెను పోషించుకునేందుకు కూలీ పనులు చేసుకుంటోంది. బిడ్డ పక్షవాతంతో మంచానికి పరిమితమైంది. ఆధార్​ లేకపోవడం వల్ల పింఛను రావడం లేదు. ఈ విషయమై స్పందించిన స్థానిక జడ్పీటీసీ ఆమెకు ఆధార్​ కార్డు ఇప్పించారు. త్వరలో దివ్యాంగ పింఛన్​ అందేలా చేస్తామని చెప్పారు.

zptc help to women in kumuram bheem asifabad
స్పందించిన జడ్పీటీసీ.. మహిళ వద్దకే ఆధార్​
author img

By

Published : Mar 15, 2020, 5:13 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బెన మండలం నవేగాంకు చెందిన చేటరీ చంద్రుబాయి కుమార్తె చేటరీ మైనబాయి(33)కి పక్షవాతం వచ్చింది. మైనబాయికి ఇప్పటి వరకు ఆధార్‌ కార్డు లేదు. ఆమెకు పింఛను రావడం లేదు. ఈ విషయాన్ని కార్యదర్శి కిరణ్‌ జడ్పీటీసీ సభ్యుడు సంతోష్‌కు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన జడ్పీటీసీ శనివారం తహసీల్దార్‌ రియాజ్‌ అలీతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లారు.

అక్కడికే ఆధార్‌ యంత్రం తెప్పించి ఆధార్‌ కార్డు ఇప్పించేలా కృషి చేశారు. త్వరలో సదరం ధ్రువపత్రం ఇప్పించి, జిల్లా పాలనాధికారితో మాట్లాడి దివ్యాంగుల పింఛను వచ్చేలా చేస్తామని జడ్పీటీసీ సంతోష్‌ తెలిపారు. అంత్యోదయ కార్డు ఇచ్చి నెలకు 35 కిలోల బియ్యం ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:దేశంలో 'జనగణ' మన సమస్య ఇది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.