ETV Bharat / state

కొత్త దారిలో 'సాగు'తున్నారు.. ఆదర్శంగా నిలుస్తున్నారు! - Telangana News Updates

ఏటా సంప్రదాయక పంటలను పండిస్తూ అనేక మంది రైతులు ప్రతికూల వాతావరణంతోపాటు పంట విక్రయించుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఇందుకు భిన్నంగా జిల్లాలోని కొందరు యువకులు మాత్రం నవ్యరీతిలో ‘సాగు’తూ విజయం సాధిస్తున్నారు. ఆసిఫాబాద్‌లో కెరమెరిలో ఆపిల్‌ పండుతున్న నేపథ్యం.. ఉన్నత విద్యావంతులను వ్యవసాయం వైపు నడిపిస్తోంది. క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కొత్త దారిలో.. సాగుతున్నారు..
కొత్త దారిలో.. సాగుతున్నారు..
author img

By

Published : Jan 5, 2021, 12:20 PM IST

ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలంలోని గంగాపూర్‌ గ్రామానికి చెందిన యువరైతు శంకర్‌, డిగ్రీ పూర్తి చేశారు. తనకున్న మూడు ఎకరాల్లో టామటా, వంకాయ, గోబీ, అల్చింత, మిర్చి పంటలను పండిస్తారు. ఏడాదికి రూ.1.50 లక్షల పెట్టుబడి పెడుతున్నారు. రూ.5 లక్షల విలువగల పంటలను ఏడాది కాలంలో పండిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయం నుంచి కూరగాయల పంటలకు మరింత డిమాండ్‌ పెరిగింది. అందుకు అనుగుణంగానే వీటిని పండించడానికి కృషి చేస్తున్నానని శంకర్‌ పేర్కొన్నారు.

కొత్త దారిలో.. 'సాగు'తున్నారు..
  • సిర్పూర్‌(టి) మండలం బెంగాలీ క్యాంప్‌నకు చెందిన అనూప్‌ బిస్వాస్‌ తనకున్న రెండు ఎకరాల్లో తమలపాకు మొక్కలను పెంచుతున్నారు. వీటితో పాటు ఖర్జూర, వక్క (పోకలు)ల మొక్కలు సైతం నాటారు. పంటకు నిత్యం నీళ్లు ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. నజ్రుల్‌నగర్‌, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌తో పాటు, మంచిర్యాల వరకు నిత్యం ఆకులను ప్యాక్‌ చేసి పంపిస్తున్నారు. నెలకు సుమారుగా రూ.20 వేల వరకు ఆదాయం వస్తుంది. ఖర్జూర, వక్క మొక్కలు చిన్నగా ఉన్నాయని ఇవి పెరిగితే అదాయం రెట్టింపవుతుందే ఆశాభావం అనూప్‌ వ్యక్తం చేశారు.
కొత్త దారిలో.. 'సాగు'తున్నారు..
కొత్త దారిలో.. 'సాగు'తున్నారు..
  • రెబ్బెన మండల కేంద్రానికి చెందిన అజ్మీరా వస్రాం నాయక్‌ డిగ్రీ, బీఎడ్‌ పూర్తి చేశారు. సాగువైపు అడుగేసి రెండు ఎకరాల్లో కాకర, బీరకాయ, టమోటా పండించేవారు. బీరకాయ కోసం రూ.20వేల పెట్టుబడితో పంట వేశారు. మూడు నెలల్లోనే రూ.మూడు లక్షల వరకు లాభం వచ్చింది. కూరగాయలను మహారాష్ట్రలోని చంద్రపూర్‌తో పాటు, గోదావరిఖని, మంచిర్యాలకు మార్కెట్లకు తరలిస్తారు. తాజాగా జిల్లాలో ఎవరూ సాగు చేయని రీతిలో క్యారెట్‌ను పండిస్తున్నారు. ప్రస్తుతం కోతకు వచ్చింది. కూరగాయల సంరక్షణకు ఉద్యానవన అధికారుల సలహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అజ్మీరా వస్రాం నాయక్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాంకిడి మండలం ఘట్‌జనగామ్‌ గ్రామానికి చెందిన గుర్నులే వినోద్‌ డిగ్రీ పూర్తి చేశారు. డీఎడ్‌ సైతం చదివారు. ఏడాదిగా హైదరాబాద్‌లో ఉన్నత ఉద్యోగాల కోసం శిక్షణ కేంద్రంలో చేరారు. కొవిడ్‌ నేపథ్యంలో శిక్షణాకేంద్రం మూతపడడంతో ఇంటికి చేరారు. తమకున్న రెండు ఎకరాల్లో ప్రతీ ఏటా పత్తిని పండించే నాన్నకు అరకొర ఆదాయం ఒక్కోసారి నష్టాలు సైతం మిగిలాయి. ఈ ఏడాది మాత్రం వినోద్‌ రెండు ఎకరాల్లో పూర్తిగా అల్చింత, వంకాయ, టమోటా, చిక్కుడు, గోబీ, మిర్చి, కూరగాయలను వేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌తో పాటు, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, గోదావరిఖని మార్కెట్‌కు వీటిని తరలిస్తూ నెలకు రూ.40 వేల వరకు ఆదాయం పొందుతున్నారు.

ఇదీ చదవండి: అన్నదాతకు దక్కని 'మద్దతు'- అందుకే ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.