ETV Bharat / state

ఆసిఫాబాద్​లో ప్రపంచ వెదురు దినోత్సవం

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో ప్రపంచ వెదురు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని కలెక్టర్​ హామీ ఇచ్చారు.

ఆసిఫాబాద్​లో ప్రపంచ వెదురు దినోత్సవం
author img

By

Published : Sep 18, 2019, 7:56 PM IST

కుల వృత్తులను కాపాడుకొని, భవిష్యత్ తరాలకు తెలియజేయాలని కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా పాలనాధికారి రాజీవ్​ గాంధీ హనుమంతు అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున చేయూత అందించి వైవిధ్యమైన వస్తువులు తయారు చేసేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. మేదరులకు ఉచితంగా వెదురు అందిస్తామని జిల్లా అటవీ అధికారి రంజిత్​ నాయక్​ తెలిపారు.

ఆసిఫాబాద్​లో ప్రపంచ వెదురు దినోత్సవం

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో ఏం జరుగుతుందో..!

Intro:ప్రపంచ వెదురు దినోత్సవం....

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లోని స్థానిక రోజ్ గార్డెన్ లో మేదరి సంగం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.

స్థానిక రోజు గార్డెన్ లో ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మేదరులు ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా అటవీ శాఖ అధికారి రంజిత్ నాయకులు పాల్గొన్నారు. మేదరులు స్టాల్ను ఏర్పాటు చేసి వారు తయారు చేసినటువంటి కళాకృతులను చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మొత్తంలో 343 కుటుంబాలు వెదురుతో తయారు చేస్తున్నటువంటి వస్తువులతో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ప్రభుత్వము చేయూతను ఇచ్చి వైవిధ్యమైన టువంటి వస్తువులను తయారు చేయడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. స్పందించినటువంటి జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్ నాయక్ మాట్లాడుతూ మేదరులకు వెదురును ఉచితంగా పంపిణీ చేస్తామని ఎట్టకేలకు హామీలు కురిపించారు. అటవీ శాఖ నుంచి ఇబ్బందులు ఉన్నప్పటికీ వీరికి సహాయం అందిస్తామని సభాముఖంగా తెలిపారు. అనంతరం కొమురం భీం జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా లోన్ లను ఇప్పించే ప్రయత్నం చేసి వీరి జీవనాధారానికి తోడ్పడు తామని పేర్కొన్నారు. కులవృత్తులను నమ్ముకొని ఉన్నవారికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కులవృత్తులను ముందు తరం వాళ్లకు కూడా అందించాలని అన్నారు. కుల వృత్తుల గురించి ముందు తరాలకు అర్థమయ్యేలా చెప్పి కులవృత్తులను కాపాడుకోవాలని తెలిపారు.

జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

Body:tg_adb_25_18_prapancha_veduru_dinoshavam_avb_ts10078

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.