కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో భాజపా నాయకులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ విజ్డం ఫ్లూట్‌ను ఆవిష్కరించారు. భగవద్గీత వినేందుకు వీలుగా సేఫ్ షాప్ అనే సంస్థ ఈ పరికరాన్ని రూపొందించింది. విజ్డం ఫ్లూట్‌ను భగవద్గీత పుస్తకంలోని అక్షరాలపై పెట్టినప్పుడు శబ్ద రూపంలో వినిపిస్తుంది.
ఈ పరికరం ద్వారా 18 భాషల్లో భగవద్గీత వినొచ్చని శ్రీనివాస్ తెలిపారు. విజ్డం ఫ్లూట్ చిన్న పిల్లలు, వృద్ధులు భగవద్గీత వినడానికి ఉపయోగపడుతందని అన్నారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ జిల్లా ఉపాధ్యక్షుడు శివ, హిందు వాహిని పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా ప్రభావం: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పైపైకి..