అల్లుడిపై మామ కత్తితో దాడి చేసిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్టీ కులానికి చెందిన నవీన్, బీసీ సామాజిక వర్గానికి చెందిన కావ్య గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరు పెద్దలను ఎదిరించి 3 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి నచ్చని కావ్య తండ్రి సత్యనారాయణ కోపోద్రిక్తుడై అల్లుడు నవీన్‌పై కత్తితో దాడికి దిగాడు.
నవీన్, కావ్యలది కులాంతర వివాహం కావడం వల్లనే కక్షగట్టాడు అమ్మాయి తండ్రి. ఇవాళ ఉదయం నవీన్‌పై ఘాతుకానికి పాల్పడ్డాడు. అది గమనించిన స్థానికులు వెంటనే నవీన్‌ను తిర్యాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవీన్ కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."