హిమాలయాల శ్రేణి పంగార్చుల్ల పర్వతారోహణకు తెలంగాణ నుంచి 28 మంది ఎంపికయ్యారు. ఈ బృందానికి నాయకురాలిగా ఆదివాసీ బిడ్డ ఎంపికయ్యారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామానికి చెందిన అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ మడావి కన్నీబాయికి ఈ అరుదైన అవకాశం దక్కింది.
ఆమె నియామకంపై రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపకుడు రంగారావు తెలిపారు. దేశ చరిత్రలోనే హిమాలయాల పర్వతారోహణకు ఓ ఆదివాసీ బిడ్డ ఎంపిక కావడం ఇదే తొలిసారని వెల్లడించారు.
- ఇదీ చూడండి : హైకోర్టు సివిల్ జడ్జీగా 24 ఏళ్ల ఆదివాసీ కుర్రాడు...