కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఖైరీగూడ గ్రామానికి చెందిన ఇంద్రుబాయి పిడుగు పాటుతో మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన పోయం లచ్చు... చేనులో పత్తి తీసేందుకు కొందరు గ్రామస్థులను వెంట తీసుకెళ్లాడు. వర్షం రావడం వల్ల కూలీలంతా చెట్టు కిందకి వచ్చి కూర్చున్నారు. అదే సమయంలో పిడుగు పడి ఇంద్రుబాయి అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే ఉన్న పోయం లచ్చు, పర్వత్ బాయి, మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన గిన్నెదారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: ఆన్లైన్ గేమ్ కోసం 78లక్షలు అప్పు- ఓటమితో ఆత్మహత్య