కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని చిలాటుగూడ గ్రామ సమీపంలో పులి సంచరిస్తోందంటూ... స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామ శివారులో ఓ వాగు ఒడ్డున పులి అడుగు జాడలు గుర్తించారు.
కవ్వాల్ అభయారణ్య ప్రాంతంకాగా అడవి మృగాలు సంచరించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని... భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు అటవీ శాఖ అధికారి పూర్ణిమ అన్నారు.
ఇదీ చదవండిః కరోనా నుంచి కాపాడుకోండిలా!