Tiger Attack on Farmer in Komaram Bheem District : కుమురం భీం జిల్లా అటవీప్రాంతంలో ఓ పశువుల కాపరిపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వ్యవసాయ పనులకు, బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు.
అటవీ అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని నందిగూడా అటవీ ప్రాంతంలో పెద్దపులుల సంచారం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఆ ప్రాంతం వైపు రోజులాగానే పశువుల కాపరి గులాబ్ దాస్ వెళ్లాడు. ఒక్కసారిగా ఆ కాపరిపై పెద్దపులి దాడి(Tiger Attack on Person) చేసింది. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Tiger Hulchul in Kagaznagar : నందిగుడా అటవీప్రాంతంలో దాడిచేసిన పులి మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం పరిధిలోని రాజుర అడవుల నుంచి వచ్చిందని అధికారులు గుర్తించారు. ఆ పులి కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోనే సంచరిస్తుందని(Tigers in Kagaznagar Forest), దానికి నాలుగు పిల్లలు ఉన్నట్లు అటవీ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. పులి పిల్లలు మరో మూడు నెలల్లో పెద్దవై ఒంటరిగా సంచరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Tiger Roaming in Kagaznagar : తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కుమరం భీం జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ తడోబా ఇంద్రావతి అభయారణ్యాల నుంచి పులులు రాకపోకలు సాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ అటవీ ప్రాంతం పులులకు ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో ఏటా వాటి సంతతి పెరుగుతోందన్నారు. జిల్లాలోని కేవలం కాగజ్‌నగర్ అటవీ డివిజన్(Kagaznagar Forest Area) పరిధిలోని 10 నుంచి 15 వరకు పులులు రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారు.
జిల్లాలో పత్తి, వరి, కంది, మొక్కజొన్న పంటలు చేతికి వచ్చే సమయం అవ్వడంతో పులి సంచారిస్తున్నందున కూలీలు ఎవ్వరూ పనికి రావడం లేదని రైతులు వాపోతున్నారు. పనికి వెళ్లిన పులి ఎటు నుంచి వచ్చి దాడి చేస్తోందని అన్నదాతలు ఆందోళన(Farmers Afraid in Komaram Bheem) చెందుతున్నారు. ప్రధానంగా కాగజ్‌నగర్ మండలంలోని ప్రతి గ్రామంలో నివసిస్తున్న ప్రజలు కూలి పనికి వెళ్లాలన్నా ఆలోచిస్తున్నారు.
People Afraid of Tiger Roaming at Kagaznagar : పులి సంచరించే ప్రాంతంలోనే రైతుల పొలాలు ఉండటంతో ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు అడవి పందుల బెడదతో మంచెలు ఏర్పాటు చేసుకొని రాత్రి సమయంలో కాపలా ఉంటున్నారు. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులి మనుషులపై దాడులు చేస్తున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
"కాగజ్‌నగర్ అటవీప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది. జంతువులకు, మనుషులకు ఎలాంటి నష్టం జరగకుండా అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పులి ఉన్న ప్రాంతాల్లో ఎలా ఉండాలో తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం."- సట్ల వేణుగోపాల్, అటవీ అధికారి
గాండ్రిస్తూ దూసుకొచ్చిన పెద్దపులి.. భయంతో వణికిపోయిన టూరిస్ట్‌లు.. చివరకు ఏమైంది?
Tiger viral video : యూనిటీ అంటే ఇది.. గేదెల దెబ్బకు పులి ఔట్
తొమ్మిది మందిని చంపిన పులి.. గురిచూసి మట్టుబెట్టిన షార్ప్ షూటర్లు!