ETV Bharat / state

ఏరులై పారుతున్న గుడుంబా

మద్యం దుకాణాల మూసివేతతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గుడుంబా ఏరులై పారుతోంది. మహారాష్ట్రకు పొరుగునే ఉన్న బెజ్జూరు, చింతల మానేపల్లి, కౌటాల, సిర్పూర్(టీ), పెంచికలపేట, దహెగాం, కాగజ్​నగర్ మండలాలతోపాటు ఆసిఫాబాద్ ఏజెన్సీలోని ఆసిఫాబాద్, లింగాపూర్, తిర్యాని, రెబ్బెన, కెరమెరి మండలాల్లో వందల సంఖ్యలో గుడుంబా బట్టీలు వెలిశాయి.

The preparation of the gudumba in kumuram bheem asifabad
ఏరులై పారుతున్న గుడుంబా
author img

By

Published : Apr 22, 2020, 1:57 PM IST

కరోనా నియంత్రణ కోసం మద్యం దుకాణాల మూసివేత.. నాటుసారా తయారీదారులకు వరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో గుడుంబా బట్టీలు వెలిశాయి. నిన్నమొన్నటిదాకా రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయించిన సారా ప్యాకెట్ల ధరలు అమాంతం 100 రూపాయలకి పెంచేశారు.

మహారాష్ట్రకు పొరుగునే ఉన్న బెజ్జూరు, చింతల మానేపల్లి, కౌటాల, సిర్పూర్(టీ), పెంచికలపేట, దహెగాం, కాగజ్​ నగర్ మండలాలతోపాటు ఆసిఫాబాద్ ఏజెన్సీలోని ఆసిఫాబాద్, లింగాపూర్, తిర్యాని, రెబ్బెన, కెరమెరి మండలాల్లో వందల సంఖ్యలో గుడుంబా బట్టీలు వెలిశాయి. ఆవాసాలకు దూరంగా పంటపొలాలు, అటవీ ప్రాంతాల మధ్యలో సారా తయారు చేసి ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి రాత్రి వేళల్లో సమీప మండల కేంద్రాలు, పట్టణాలకు తరలించి విక్రయాలు జరుపుతున్నారు.

ఎక్సైజ్ అధికారులకు చిక్కకుండా అత్యంత పకడ్బందీగా గుడుంబాను రవాణా చేస్తున్నారు. అధికారుల కదలికలను పసిగట్టేందుకు ప్రత్యేకంగా మనుషులను నియమించుకున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి సారా తయారీదారులను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.