కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో సీపీఎం తరఫున అభ్యర్థిని నిలబెడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ వేస్తారన్నారు. సీపీఐ, జనసమితి, తెదేపా నాయకులతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. కాంగ్రెస్కు మద్దతిచ్చేది లేదన్నారు. ప్రధాని మోదీ మతోన్మాదాన్ని పోషిస్తున్నాడని విమర్శించారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక లేదని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: పిల్ల తిమింగలం వలలో పడితే తల్లి ఏం చేసిందో చూడండి..