Temperatures dropped: రాష్ట్రంలో రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గడం వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయంతో పోలిస్తే రాత్రిళ్లు చలి తీవ్రత మరీ ఎక్కువవుతోంది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి శీతలగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చల్లని వాతావరణం పెరుగుతోంది.
శుక్రవారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమురంభీం జిల్లాలోని గిన్నెధరిలో 8, హైదరాబాద్‌లో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదవడం ఈ ఏడాది ఇదే తొలిసారని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. . రానున్న వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీలు తగ్గి.. చలి తీవ్రత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.