కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం… కొవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో నూతనంగా నియామకమైన కాసం శ్రీనివాస్, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కోనప్ప అన్నారు. రైతుల సంక్షేమానికి తాను పాటుపడతానని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కాసం శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణ రావు, కాగజ్ నగర్ పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: CPM: 'తడిసిన ధాన్యాన్ని ఎంఎస్‌పీ ధరకే కొనుగోలు చేయాలి'