కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దుబ్బగూడ గ్రామానికి చెందిన ధర్మ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. యువకుడి తండ్రి వాసుదేవ్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఈ రోజు ఉదయం దుబ్బగూడలోని వ్యవసాయ బావిలో ధర్మ శవమై కనిపించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: 400 ఏళ్ల నాటి ఉత్సవం... మైసూరు దసరా ప్రత్యేకం!