మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వాల్మీకినగర్ కాలనీలోని ప్రసిద్ధ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోశ్ఛరణల మధ్య శివలింగానికి ప్రత్యేక అర్చన కార్యక్రమాన్ని జరిపించారు.
కుమురంభీం జిల్లాలోని శివమల్లన్న ఆలయంలో సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామునుంచే శివాలయాలకు చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూకట్టారు.
ఇదీ చదవండి: కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం.. అభిషేకాలతో తన్మయత్వం