కుమురం భీం జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామంలో అరుదైన వింత ప్రాణి కనిపించింది. పామును పోలి ఉండి నాలుగు కాళ్లు కలిగి ఉండటంతో స్థానికులు ఆ జీవిని చూడటానికి పరిగెత్తారు. గ్రామానికి చెందిన బండి లచ్చన్న.. ఇంట్లో పనులు చేసుకుంటుండగా పాము లాంటి ఓ ప్రాణి కనిపించింది. రెండు అడుగుల పొడవు కలిగిన ఆ జీవిని అతను పరీక్షగా చూడగా నాలుగు కాళ్లు కనిపించాయి.
దీంతో లచ్చన్న భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ జీవిని పరిశీలించిన అధికారులు.. కాళ్లు కలిగిన పాము లాంటి జీవులు అరుదుగా ఉంటాయని, ఇవి సాధారణంగా అడవుల్లో ఉంటాయని చెప్పారు.
దారితప్పి నివాస ప్రాంతాల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు భావించారు. దీనిని కామన్ స్నేక్ అంటారని తెలిపారు. సాధారణంగా ఇది పాలపిందె లాగా ఉంటుందనీ, కానీ ఈజీవి కాస్త పొడవుగా ఉందని డిప్యూటీ రేంజర్ ప్రకాష్ తెలిపారు.
ఇదీ చదవండి: బండి సంజయ్ సవాల్‌తో పోలీస్ బందోబస్తు