ETV Bharat / state

దోస్త్ కావాలి... ప్రవేశాలు కల్పించండి - undefined

దశాబ్దాలుగా మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉన్నత విద్య అందించిన ఎస్కేఈ కళాశాల దోస్త్​లో పేరు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధ్యాపకులను నియమించి... ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ske
author img

By

Published : May 27, 2019, 11:32 PM IST

దోస్త్ కావాలి... ప్రవేశాలు కల్పించండి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏకైక ఎయిడెడ్ డిగ్రీ కళాశాల... సిర్పూర్ కాగజ్ నగర్ ఎంప్లాయిస్ డిగ్రీ కళాశాల. దశాబ్దాలుగా మారుమూల ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర విద్యార్థులకు ఉన్నత విద్యను అందించిన ఈ కళాశాల చరిత్రపుటలకే పరిమితం కానుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ సారి దోస్త్ నోటిఫికేషన్​లో ఎస్కేఈ కళాశాల పేరు లేకపోవడం వల్ల ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ప్రవేశాలు లేనట్లుగానే తెలుస్తోంది.

ఒక్కరోజు వేతనంతో ఏర్పాటు

పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్ నగర్​లో సర్సిల్క్ మిల్లు, సిర్పూర్ కాగితం మిల్లు కార్మికుల ఒకరోజు వేతనంతో సిర్పూర్ కాగజ్ నగర్ ఎంప్లాయిస్ డిగ్రీ కళాశాల 1982- 83 వ సంవత్సరంలో స్థాపించారు. కార్మికుల పిల్లలతో పాటు ఇతర గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం కళాశాలను ఏర్పాటు చేశారు. 1990లో ఎయిడెడ్ వచ్చింది. అప్పట్లో ఈ కళాశాలలో సీటు దొరకని పరిస్థితి ఉండేది.

ప్రస్తుతం 6 విద్యార్థులు

ప్రతిభావంతులైన 29 మంది అధ్యాపకులు ఉండడంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. 2006 మార్చి 27న అప్పటి ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలలో అధ్యాపకుల ఉద్యోగ భర్తీని నిలిపివేస్తూ జీవో 35ను విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ కళాశాలలో అధ్యాపకులను నియమించలేదు. ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. గతేడాది ఈ కళాశాలలో 6 గురు విద్యార్థులు చేరాలంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల హామీగానే

ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఈ కళాశాల ఇప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోతోంది. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలు కలిసి మొత్తం 72 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఎన్నికల హామీగానే ఈ కళాశాల ఉపయోగపడుతోంది తప్ప ఎలాంటి పరిష్కారం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమం

Intro:filename:

tg_adb_21_DOST_lo_leni_SKE_degree_collage_pkg_c11

Body:ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఏకైక ఎ డిగ్రీ కళాశాల సిర్పూర్ కాగజ్ నగర్ ఎంప్లాయిస్ డిగ్రీ కళాశాల. దశాబ్దాలుగా మారుమూల ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర విద్యార్థులకు ఉన్నత విద్యను అందించిన ఈ కళాశాల పూర్వవైభవం వచ్చేనా.. లేక చరిత్రపుటలకే పరిమితం కానుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. డిగ్రీలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా భర్తీ చేయనున్నారు. గత వారం ఈ నోటిఫికేషన్ విడుదలవడంతో దరఖాస్తు స్వీకరణ ప్రారంభమయ్యాయి. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలో డిగ్రీ గ్రూపుల సీట్ల వివరాలు ఆన్లైన్ నోటిఫికేషన్ లో చేర్చారు. కానీ కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని డిగ్రీ కళాశాల కు మాత్రం ఆ అవకాశం లభించలేదు. కాకతీయ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. దోస్త్ నోటిఫికేషన్ లో ఎస్కేఈ కళాశాల లేకపోవడంతో ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ప్రవేశాలు లేనట్టుగానే తెలుస్తోంది.

పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్ నగర్లో సర్సిల్క్ మిల్లు, సిర్పూర్ కాగితం మిల్లు కార్మికుల ఒకరోజు వేతనంతో సిర్పూర్ కాగజ్ నగర్ ఎంప్లాయిస్ డిగ్రీ కళాశాల 1982- 83 వ సంవత్సరంలో స్థాపించారు. కార్మికుల పిల్లలతో పాటు ఇతర గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత చదువుల నిమిత్తం కళాశాలను స్థాపించారు. అంచెలంచెలుగా ఎదిగిన ఈ కళాశాలకు 1990లో ఎయిడెడ్ వచ్చింది. బిఏ, బి.కాం, బి ఎస్ సి, బి ఎస్ సి. బి జెడ్ సి, తెలుగు,ఆంగ్ల మాధ్యమంలో తదితర కోర్సుల్లో దాదాపు రెండు వేలకు పైగా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారు. అప్పట్లో ఈ కళాశాలలో యూనివర్సిటీ స్థాయిలో పలువురు విద్యార్థులు సాధించారు. ఎంత ప్రతిభ ఉన్నా పైరవీ చేసుకుంటే గాని ఈ కళాశాలలో సీటు దొరకని పరిస్థితితులు ఉండేవి. ప్రతిభావంతులైన 29 మంది అధ్యాపకులు ఉండడంతో ఈ కళాశాల నుంచి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రిన్సిపాల్ తో పాటు 22 మంది అధ్యాపకులు 10 మంది కాంట్రాక్టు అధ్యాపకులు 14 మంది నాన్ టీచింగ్ ఉద్యోగులు ఉండేవారు. 2006 మార్చి 27న అప్పటి ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలలో అధ్యాపకులు ఉద్యోగుల భర్తని నిలిపివేస్తూ జీవో నెంబర్ 35 ను విడుదల చేసింది. అప్పటి నుంచి డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు ఉద్యోగులు పదవీ విరమణ పొందడంతో మళ్లీ ఆ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయలేదు.
కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకుల నియామకాలు చేపడదామంటే కళాశాలలో నిధులు లేవు. ప్రస్తుతం ఈ కళాశాలలో లో కేవలం ఏడుగురు మాత్రమే సిబ్బంది ఉన్నారు. ఇందులో బెల్లంపల్లి డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా కొనసాగుతున్నారు. ఇద్దరు అధ్యాపకులు. ఇద్దరు నాన్ టీచింగ్ ఉద్యోగులు. ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉన్నారు.

ఈ కళాశాలలో 2016-17 లో మొత్తం 393, 2017-18 సంవత్సరంలో 170,2018-19 లో 84 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు, గతేడాది ఈ కళాశాలలో లో 6 గురు విద్యార్థులు చేరాలంటే ఈ కళాశాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఈ కళాశాల విద్యార్థులు లేక వెలవెలబోతోంది. ప్రస్తుతం ప్రథమ ద్వితీయ తృతీయ సంవత్సరాలు కలిసి మొత్తం 72 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.

జీవో నం35 తో కుంటుపడిన ఎస్కేఈ డిగ్రీ కళాశాల నాయకులకు మాత్రం ప్రతిసారి ఎన్నికల హామీగా మిగిలి పోతోంది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ ప్రాంత నాయకులు ఈ సమస్య ఎన్నికల హామీగానే ఉపయోగపడింది. ఈ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఒక్కటే పరిష్కారమని గుర్తించిన పలు విద్యార్థి సంఘాలు కళాశాల కమిటీలు పోరాటాలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన ప్రజాప్రతినిధులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కళాశాలకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఎండ్ విత్ పిటుసి

(గమనిక: పిటుసి ఫైల్స్ రెండు పంపించాను. ఏది బాగుంటే అది వాడగలరు.)

బైట్స్:

01) తెలుగు అధ్యాపకులు: లక్ష్మీ నరసింహ
02) విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్: పొన్న రమేష్
03) ఎస్.ఎఫ్.ఐ.జిల్లా కార్యదర్శి: చాపిలే సాయికృష్ణ
04) తృతీయ సంవత్సరం విద్యార్థిని: ఉదయశ్రీ

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.