కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో మైనార్టీ దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సిర్పూర్ నియోజకవర్గం భాజపా ఇంఛార్జి డా.కొత్తపల్లి శ్రీనివాస్, డా.అనిత దంపతులు దివ్యాంగులకు రంజాన్ కిట్లు, మాస్క్లు అందించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నియమ నిబంధనలను ప్రజలు తప్పక పాటించాలని సూచించారు. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. భౌతికదూరంతోపాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని పేర్కొన్నారు.