ETV Bharat / state

ఎస్సై ఉదారత : కాళ్లు ఇచ్చి.. కన్నీళ్లు తుడిచారు..! - తెలంగాణ వార్తలు

మూఢ నమ్మకాలతో ఒకరు, ప్రమాదంలో ఒకరు, అనారోగ్య కారణాలతో మరొకరు అలా నలుగురు కాళ్లు పోగొట్టుకున్నారు. మంచానికే పరిమితమై గడ్డు కాలం వెళ్లదీస్తున్నారు. వారిపట్ల ఆపద్బాంధవుడిగా ఎదురయ్యారు ఎస్సై రామారావు. ఆయన చొరవ చూపి కృత్రిమ కాళ్లు అందించి వారి కన్నీటిని తుడిచారు.

si-rama-rao-gave-artificial-leg-to-victims-at-tiryani-mandal-in-komaram-bheem-asifabad-district
ఎస్సై ఉదారత: కాళ్లు ఇచ్చి... కన్నీళ్లు తుడిచారు!
author img

By

Published : Jan 31, 2021, 6:54 PM IST

Updated : Jan 31, 2021, 7:00 PM IST

ఎస్సై ఉదారత : కాళ్లు ఇచ్చి.. కన్నీళ్లు తుడిచారు..!

వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోయిన ఆదివాసీలకు తిర్యాని పోలీసులు కృత్రిమ కాళ్లను అందించి ఉదారత చాటుకున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల మండలం తిర్యానిలోని అటవీ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు మూఢనమ్మకాలు, ప్రమాదాలతో కాళ్లు కోల్పోయారు. మంచానికే పరిమితమై భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారికి ఆపద్బాంధవుడిగా ఎస్సై రామారావు చేయూతనిచ్చారు.

తిర్యాని మండలం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పుప్పాల రామారావు ఆది నుంచి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మారుమూల గ్రామాల్లో లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రహదారి సౌకర్యం, తాగునీటి వసతిని కల్పించారు. కాళ్లు లేకుండా బాధపడుతున్నవారికి కృత్రిమ కాళ్లు అందజేశారు. కృత్రిమ కాలును అమర్చడంతో బాధితులు మెల్లమెల్లగా నడుస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాక్టర్ ప్రమాదం..

గుండాలకి చెందిన కోవ లక్ష్మి 2017లో ట్రాక్టర్​ ప్రమాదంలో కాలు కోల్పోయింది. మూడేళ్ల నుంచి మంచానికే పరిమితమైంది. ఈ తరుణంలో కృత్రిమ కాలును అమర్చడం వల్ల కొద్దిదూరం ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతుంది. తమ పని తాను చేసుకుంటూ ఇంట్లో పనుల్లో కొంతవరకు సాయం చేస్తోంది. మూడేళ్ల నుంచి ఇప్పటివరకు వికలాంగుల పింఛన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

నాటు వైద్యంతో...

గంగాపూర్ గ్రామానికి చెందిన మడావి నీలును 2019లో చేనులో పనిచేస్తుండగా పాము కాటేసింది. ఆస్పత్రికి వెళ్ళకుండా నాటు వైద్యం చేయించారు. ఫలితంగా ఆమె కాలు కుళ్లిపోయింది. ఈ విషయం ఎస్సై రామారావు దృష్టికి వెళ్ళింది. ఎస్సై రామారావు చొరవతో గోదావరిఖని పట్టణానికి చెందిన ఆలయ ఫౌండేషన్ సహకారంతో కృత్రిమ కాలును అమర్చారు. ప్రస్తుతం నీలు నడవడంతో పాటు, తన పనులు తాను చేసుకుంటోంది. ఇప్పటివరకు వికలాంగుల పింఛన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి పింఛన్ ఇవ్వాలని కోరుతోంది.

అగ్నిప్రమాదం...

గుండాల గ్రామానికి చెందిన కుమురం పాండుకు 15 ఏళ్ళ క్రితం అగ్నిప్రమాదంలో కాలు పూర్తిగా పోయింది. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఎటు వెళ్ళలేక పోయేవాడు. కృత్రిమ కాలును పెట్టించిన అనంతరం కర్రల సహాయముతో ప్రస్తుతం పంటచేనుకు సైతం వెళ్తున్నాడు. చేనులో పనులు చేసుకుంటూ కుటుంబానికి కొంత ఆసరాగా నిలుస్తున్నాడు. ఇంకా కొన్ని రోజులు గడిస్తే కర్రలు లేకుండా కృత్రిమ కాలుతో నడవగలుగుతానని పాండు సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

అనారోగ్యం

గడలపల్లి గ్రామానికి చెందిన కుడుమేత కిష్టు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. 2017లో అనారోగ్యం కారణంగా కాలిలో గడ్డలు ఏర్పడ్డాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఆస్పత్రికి వెళ్లలేదు. అలా కాలు కోల్పోయారు. ఎస్సై రామారావు చొరవ చూపకుంటే తాను నడిచే స్థితిలో లేకుండా చనిపోయేవరకుమంచానికే పరిమితమయ్యేవాడినని కిష్టు ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ కాలు అమర్చడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మడావి నీలు అనే యువతి మూఢనమ్మకాలతో కాలు కోల్పోయిన తీరు నన్ను ఎంతగానో బాధించింది. ఆస్పత్రికి తీసుకెళ్తే కాలు తీసేయకపోతే బతకడం కష్టమని చెప్పారు. దీనిపై అంతర్జాలంలో వెతకడంతో పాటు వైద్యులను సంప్రదించాను. గోదావరిఖనిలోని ఆలయ ఫౌండేషన్​తో మాట్లాడాను. రూ.20 వేల వరకు ఉండే కృత్రిమ కాలును వారు ఉచితంగా అమర్చారు. కాలుతో పాటు కర్రలు సైతం ఇచ్చారు. వైద్యులు సూచించినట్లుగా కృతిమ కాలు అమర్చడం వల్ల బాధితులు నడవగలుగుతున్నారు.

-రామారావు, తిర్యాని ఎస్సై

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో పెరుగుతున్న స్కిజోఫ్రీనియా కేసులు

Last Updated : Jan 31, 2021, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.