కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. అధిక జన సంచారం ఉన్న ప్రాంతాల్లో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో నిరంతరం శానిటైజేషన్ చేస్తున్నారు.
ఈ పారిశుద్ధ్య పనులను కమిషనర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ప్రయాణికులకు వైరస్ పట్ల అవగాహన కల్పించారు. అందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని తెలిపారు. సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలని అన్నారు.
- ఇదీ చదవండి: ట్రాఫిక్ నియమాలపై సైబరాబాద్ పోలీసుల అవగాహన