రాష్ట్రంలో సంచలనం సృష్టించిన... సమత కేసులో సాక్షుల విచారణ పూర్తైంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో నవంబర్ 24న జరిగిన సామూహిక హత్యాచారం కేసు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. ఈ మేరకు ప్రభుత్వ సూచన మేరకు హైకోర్టు ఆదిలాబాద్‌లో కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేసింది. ఈ కేసుకు సంబంధించి... డిసెంబర్ 16 న పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. డిసెంబర్ 23 నుంచి సాక్షుల విచారణ ప్రారంభమైంది.
కేసు విచారణాధికారి, ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ సాక్షంతో పాటు ఇప్పటిదాకా మొత్తం 25 మంది సాక్షులను కోర్టు విచారించింది. తదుపరి విచారణను కోర్టు జనవరి మూడో తేదీకి వాయిదా వేసింది. ప్రాసిక్యూషన్ తరపున అదనపు పీపీ రమణారెడ్డి సాక్షులను ప్రవేశపెట్టారు. నిందితులు షేక్ బాబు, షేక్ షాబోద్ధీన్, షేక్ మగ్ధుం తరపున డిఫెన్స్ న్యాయవాది రహీం వాదించారు. నేరారోపణలపై జనవరి మూడో తేదీన ప్రత్యేక కోర్టు నిందితులను విచారించనుంది.
ఇవీ చూడండి : తండా యువతిపై అత్యాచారం..!