రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో వాదనలు ముగిశాయి. ఈనెల 27న ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కుమురం భీం జిల్లాలోని అటవీ ప్రాంతంలో గతేడాది నవంబర్ 24న సమతపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి డిసెంబర్ 14న నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణ కోసం డిసెంబర్ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 23 నుంచి 31 వరకు సాక్షులను విచారించారు. ఈ నెల 7, 8 తేదీల్లో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ మధ్య వాదనలు జరిగాయి.
ఇదీ చూడండి: పెద్దపల్లి పురపాలికలో డబ్బు పంచిన తెరాస అభ్యర్థి సోదరుడు